సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు,అలజడి నేపథ్యంలో గత వారం నష్టాలు జోరుతో ఉక్కిరిబిక్కిరి చేసిన దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ప్రారంభంలో నేడు, సోమవారం అదే నష్టాల జోరు కొనసాగించింది. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు గురైన సూచీలు చివరికి నష్టాలతోనే ముగిశాయి. నేటి (సోమవారం) ట్రేడింగ్లో సెన్సెక్స్ 382.62 పాయింట్లు నష్టపోయి 76,132.81 వద్ద ముగించింది.ఇక నిఫ్టీ 118.55 పాయింట్లునష్టపోయి 23,779.15ముగింపు పలికింది. అయితే భారత మార్కెట్లు నష్టపోయినప్పటికీ, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్ పరిశ్రమల మద్దతుతో ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
