సిగ్మాతెలుగు డాట్, న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి ఫై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాపై కేసులు నమోదు చేస్తారా?. గతంలో నేను చెట్టు కింద కూర్చుని ప్రభుత్వ పెద్దలకు నాలుగు మంచి మాటలు చెప్పినందుకు సుమోటోగా కేసు నమోదు చేసి నన్ను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు.మరి అమిత్ షా, నడ్డాగార్లను కూడా నాలాగే అరెస్టు చేస్తారా? నన్ను కొట్టించినట్లుగానే కొట్టిస్తారా? నాకు ఒక న్యాయం వారికి మరొక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి? అని రఘురామకృష్ణంరాజు వాంగ్యం గా ప్రశ్నించారు. బీజేపీ పెద్దలపై విమర్శలు చేసిన పేర్ని నాని అభం శుభం తెలియని వ్యక్తి అని, ఆయన లౌడ్ స్పీకర్ లో వేసిన రికార్డర్ వంటి వారిని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ అంటే ప్రధాన మంత్రికి ప్రత్యేక ప్రేమ ఏదీ లేదని, ఇదంతా కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భాగమేనని నేను చెబుతూనే వచ్చాను. అయినా మరి కొంతమందికి ఇంకా అనుమానాలు ఉన్నాయి. వాటిపై కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. సమాజ శ్రేయస్సుకోసం తెలుగుదేశం, జనసేన, బిజెపీ పార్టీలు కలుస్తాయని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. అయినా ఎవరూ నమ్మలేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి చూస్తుంటే ఆల్మోస్ట్ నేను చెప్పిందే నిజమైనట్టు అనిపిస్తుందన్నారు . విద్యా దీవెన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. ఇన్నాళ్లు ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్త పుత్రుడు పైనే అక్కసును వెళ్లగక్కే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు బిజెపి పైన కూడా తన కసిని తీర్చుకున్నారు.అని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో 30 వేల ఇంటర్వెనింగ్ ఫ్లాట్ ప్యానెల్ ( ఐఎఫ్ వీ ) స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. కేవలం 5000 మాత్రమే ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మున్సిపల్ పరిధిలోని ఐదారు స్కూళ్లు కూడా కనీస అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు ఎంపీ రఘురామా కృష్ణంరాజు.
