సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేచురల్ స్టార్ నాని, హీరోగా సుందరానికి తొందరెక్కువ తీసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేష‌న‌ల్‌లో రెండో చిత్రంగా తెర‌కెక్కిన ‘సరిపోదా శనివారం’ అంటూ విచిత్రమైన టైటిల్ తో పాన్ ఇండియా సినిమాగా నేడు, గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. అయితే గత బుధ‌వారం నుంచే ఈ సినిమా పెయిడ్ ప్రీమియ‌ర్స్ ప‌డ‌డం, బ‌య‌టి దేశాల్లో విడుద‌ల‌వ‌డం కూడా జ‌రిగిపోయాయి. దీంతో సినీ ప్రియులు ఇప్ప‌టికే సినిమాను చూసి సోష‌ల్ మీడియా ద్వారా రివ్యూ తో పాటు వారి అభిప్రాయాలు పంచుకొంటున్నారు. నాని ఇంట్రో అదుర్స్ అనేలా ఉంద‌ని, రెగ్యుల‌ర్ ఫార్మాట్ క‌థే అయినా ద‌ర్శ‌కుడు తీసుకున్న శ‌నివారం కాన్సెప్ట్ బాగుందని అంటున్నారు. ముఖ్యంగా జేక్స్ బిజాయ్ సంగీతం మూవీని ఎక్క‌డికో తీసుకెళ్లింద‌ని, అతని నుంచి ఈ రేంజ్ మ్యూజిక్ ఊహించ‌లేద‌ని సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ సూప‌ర్‌గా ఉన్నాయ‌ని, ముఖ్యంగా సూర్య, నానిల మ‌ధ్య సీన్లు పోటాపోటీగా కుదిరాయ‌ని, రెండు స‌న్నివేశాల్లో హీరో నానిని మించేలా సూర్య డామినేష‌న్ చేసేశారని , ప్రియాంకా మోహాన్ హీరో నాని సరసన గ్యాంగ్ లీడర్ తరువాత మరోసారి అందంగా, అమాయ‌కంగా చక్కటి నటనతో ఆక‌ట్టుకుంటుంద‌ని, సరిపోదా శనివారం’ మంచి కాలక్షేపానికి దిల్స్ కి డోకాలేని సినిమాగా ప్రేక్షాకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *