సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం మే 31వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా భీమవరం పట్టణంలో కూడా ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఏలూరులో కృష్ణ అభిమానులు ఏర్పటు చేసిన కాంస్య విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆవిష్కరించారు. కృష్ణ జయంతిని పురస్క రించుకుని ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు, భావోద్వే గానికి గురయ్య ఒక లేఖను అభిమానుల కోసం విడుదల చేసారు. కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా నేడు.. రీ రిలీజ్ ఫై ఆయన లేఖలో స్వాందిస్తూ ..‘‘నాన్న గారి వీరాభిమానుల్లో నేనూ ఒకడిని. పద్మా లయా స్టూడియోస్ బ్యా నర్పై ఆయన తెరకెక్కిం చిన ఎన్నోగొప్ప సినిమాల్లో ‘మోసగాళ్లకు మోసగాడు అంటే అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం . ఆ రోజుల్లోనే హాలీవుడ్ చిత్రాలను తలదన్నే స్థాయిలో ఒక తెలుగు చిత్రాన్ని నిర్మించిన సాహసి ఆయన. యాభైరెండేళ్ల క్రితమే గుర్రాలు, గన్ ఫైటింగులు, భారీ సెట్టింగులు, అందమైన లొకేషన్స్, ట్రెజర్ హంట్,అతిపెద్ద తారాగణం , కౌబాయ్ గెటప్స్ తో బడ్జెట్ పరిధులు దాటి.. తెలుగు ప్రేక్షకులకి మాత్రమే కాదు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, బెంగాలీ వంటి అన్ని భాషల్లోనూ డబ్ చేసి ఈ సినిమాను 50 దేశాల్లో చూపించిన ఘనత ఆయనది. నాన్న గారి జయంతిని పురస్కరించుకుని,తెలుగు సినిమాకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన లెజెండ్ ఆయన. మొదటి స్టీరియో సౌండ్, సినిమా స్కోప్, 70ఎమ్ ఎమ్, మొదటి జేమ్స్ బ్యాండ్ , కౌబాయ్.. ఇలా అన్ని కొత్త హంగులను తెలుగు సినిమాలకి తెచ్చి , సినిమాస్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన నాన్న జ్ఞాపకార్థం మనమందరం మళ్లీ ‘మోసగాళ్లకు మోసగాడు’ డిజిటల్లో కొత్త సాంకేతిక విలువలతో చూసి, ఆయన్ని స్మరించుకుం దాం ’’ అని మహేష్ పేర్కొన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా లోని మహేష్ బాబు లుక్ పోస్టర్ ను కూడా ఫై దృశ్యంలో చూడవచ్చు.
