సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు నేడు, బుధవారం నాడు (మే 31, 2023) తీర్పు వెలువరించింది. అవినాష్ రెడ్డి లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో వివేకా కేసులో అవినాష్ రెడ్డి కస్టడీ విచారణ అవసరం లేదని బెంచ్ సీబీఐ తరపు న్యాయవాదులతో స్పష్టం చెయ్యడం మరో కీలక పరిణామం. ప్రతి శనివారం ఉ.10 నుంచి సా.5 వరకు అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశం . సీబీఐకి అవసరమైనప్పు డు విచారణకు హాజరుకావాలి. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం గత ఏప్రిల్ 17వ తేదీన తెలంగణ హైకోర్టును ఎంపీ అవినాష్ రెడ్డి ఆశ్రయించిన నాటి నుండి కొన్ని మీడియా ఛానెల్స్ లో పత్రికలలో.. ఇక రోజు అదే వార్తకు ప్రాధాన్యం ఇస్తూ ..అవినాష్ రెడ్డి కొద్దీ గంటలలో అరెస్ట్.. అంటూ చేసిన ఊహాగానాలు కధనాలు ఏది నిజం కాకపోవడం అత్యుత్సహంగా మిగిలిపోవడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *