సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ, అధినేత జగన్ ఆలోచన ధోరణీ తనకు అర్ధం కావడం లేదని . ఇన్ని పధకాలు అమలు చేసికుడా పార్టీ ఘోర ఓటమి చెందక కూడా వాస్తవాలు గ్రహించడం లేదనిపిస్తుంది. గత నెలలో జగన్‌ను కలిసినప్పుడు మే నెల వరకూ వ్యక్తిగత కారణాలు వల్ల రాజకీయాలకు దూరంగా ఉంటానని వైసీపీ పార్టీ కార్యక్రమాలకు మే నెల వరకు సమయం ఇవ్వమని అడిగాను . ఇంతలో నాపై, సన్నిహితులపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఆ టైమ్‌లో జగన్ నాకు చిన్న పాటి ధైర్యం చెప్తారని అనుకున్నా. అలా చెప్పకుండా పార్టీ అధికారంలోకి రావడానికి ఇక మీరు పోరాటం చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి, అని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటె వారికీ మద్దతుగా సానుకూల దృక్పథంతో ఆయన ఉన్నట్లు నాకు కనిపించలేదు. పార్టీ కార్యకర్తలకు బదులు వాలంటీర్లు ను ప్రోత్సహించారు. ఇక పార్టీని ప్రజలలో బలంగా తీసుకొనివెళ్లేదెవరు?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ నాలుగు భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పగించారు. పార్టీలో నాకు ఏవిధమైన సముచిత స్థానం కలిపించారనేది ప్రజలకు తెలుసు అన్నారు గ్రంధి శ్రీనివాస్.వైసీపీ కి మరో షాక్: నేడు ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా రాజీనామా చెయ్యడంగమనార్హం..
