సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా టీ డీ జనార్ధన్ , విక్రమ్ పూల రచించిన “స్వర్ణాంధ్రప్రదేశ్ సారధి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యేరఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రధాత, భావితరాలకు మార్గదర్శకుడు, ఆంధ్ర ప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఆటుపోట్లు చుసిన ఆయన జీవిత గమనం, నాయకుడిగా పట్టుదల అందరికి ఆదర్శం అన్నారు.ఈ కార్యక్రమమంలో అచ్చెమునాయుడు తదితర కీలక నేతలు పాల్గొన్నారు.
