సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 37వ రోజు పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. నేటి మంగళవారం ఉదయం కలికిరి గ్రామం వద్ద లోకేష్ యువగళం పాదయాత్రకు విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. లోకేష్‌ తో పాటు కొంతదూరం నడచి వంగవీటి రాధా పాదయాత్ర చేశారు. అయితే గత కొంత కాలంగా టీడీపీ కి దూరంగా ఉంటూ ( ఇటు వైసిపి లోని కొడాలి నాని కి వంశీ కి కూడా సన్నిహితంగా..) త్వరలోనే టీడీపీ ని వదలి జనసేన లో చేరతారు అని ప్రచారం జరుగుతుంది. ఆయన జనసేన తరపున ఈసారి మచిలీపట్టణం నుండి పోటీ చేస్తారు? అని వార్తలు వస్తున్నా నేపథ్యంలో.. ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. ఒక వేళ జనసేన నుండి పోటీ చేసిన పొత్తు కలిస్తే టీడీపీ క్యాడర్ మద్దతు కు ఇబ్బంది లేకుండా ప్యూహం ప్రకారం నారా లోకేష్ కు సంఘీభావం ప్రకటించారా ? అన్న మీమాంస కలగటం సహజం.అయితే మరో వారం రోజులలో మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ పాల్గొనే జనసేన ఆవిర్భావ సభలో వంగవీటి రాధా రాజకీయ పయనం.. సస్పెన్సు విడిపోయే అవకాశం ఉంది. ( up update photos)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *