సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ విధానాలు వల్ల పలు ప్రవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల నిరంకుశ విద్య వ్యాపార వైఖరి బాగా తగ్గిన మాట వాస్తవం.. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మేడికల్ , ఇంజనీరింగ్ కాలేజీలలో విద్యార్థులు ఆత్మహత్యలు, అత్మహత్య ప్రయత్నాలు, అనుమానస్వదా మరణాలు విద్యార్థుల తల్లితండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యార్థుల యూనియన్స్ తో పాటు బీజేపీ , కాంగ్రెస్ పార్టీల నిరసన దీక్షలు, ఆందోళనలు విమర్శలు ఎక్కువ కావడంతో ప్రభుత్వ పెద్దలు మేల్కొన్నారు. సమయానికి భారీ పీజులు కట్టలేదని, ఎక్కవ గంటలు చదవటం లేదని, ర్యాంకులు రావడం లేదని , విద్యార్థులను దూషిస్తూ కొట్టుతూ వికృతంగా ప్రవర్తిస్తున్న పలు విద్యాసంస్థలకు, విద్యారులను ఏడిపించే ర్యాగింగ్ ను అరికట్టలేని విద్య సంస్థలకు ఇంటర్మీడియట్ కాలేజీలకు ఇకపై చెక్ పడనుంది. విద్యార్థుల ఇబ్బందులకు గురిచేసే కాలేజీ సిబ్బంది, యాజమాన్యాలపై కఠిన చర్యలకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. విద్యార్థులను వేధించినా, అవమానించినా సిబ్బందితో పాటు కాలేజీ మేనేజ్మెంట్పై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు.. విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆ కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. విద్య శాఖ అధికారులు తాజగా రాష్ట్రంలోని 14 ప్రముఖ సంస్థల కాలేజీ యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ వారితో చర్చించి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వారం రోజుల్లో విడుదల చేయనున్నారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నార్సింగ్‌లోని ప్రైవేట్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ కాలేజీలో ఇప్పటికే విద్యార్థులు చదువుతున్నందున, వచ్చే సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది.
