సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నేడు, శనివారం భీమవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను దేశప్రయోజనాలతో పాటు తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో .. పశ్చిమ గోదావరి జిల్లాలో పెండింగ్ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ప్రాధాన్యత ఇస్తాననని ప్రకటించారు. అత్తిలి రైల్వే స్టేషన్లో రెండు ఎక్ప్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ తీసుకువచ్చానని, అలాగే నరసాపురం – చెన్నై ‘వందే భారత్’ తీసుకువచ్చాను.. త్వరలోనే రైలు ప్రారంభంప్రారంభము అవుతుంది. దీనికి మన భీమవరం తో పాటు గుడివాడ కు అదనంగా హల్ట్ సాధిస్తానని అన్నారు.నేను ఆర్థిక వనరులలో నేను సామాన్యుడిని తాను వారసత్వం ఆధారంగా రాజకీయాల్లోకి రాలేదు.ఒకే రాజకీయపార్టీ బీజేపీ ని నమ్ముకొని సుమారు 40 ఏళ్లుగా పనిచేస్తున్నాను. పార్టీ నా క్రమశిక్షణ గుర్తించి ఉన్నత స్థానాలు లో నిలబెట్టింది. నన్ను నమ్ముకున్న ప్రజల ఆశయాలు నెరవేరుస్తున్నాను. అయితే నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎవరైనా హైజాక్ చేస్తే వారికీ గట్టి సమాధానం చెప్తా అన్నారు. నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి. నా మంచితనాన్ని, సహనాన్ని కెలికితే అపరిచితుడు బయటకి వస్తాడు అంటూ, ఇటీవల కొందరి నేతల తీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేసారు.
