సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా నేడు శుక్రవారం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే జగన్ కు మద్దతుగా రాయలసీమ లోని అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి వస్తుండగా .. అటు వైపు జగన్ ను తిరుమల రావద్దంటూ టీడీపీ జనసేన, బీజేపీ కొన్ని హిందూ సంఘాలు అక్కడ భారీగా మోహరిస్తుండటంతో పోలీసులు సెక్షన్ 30 విధించిన దరిమిలా పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నా నేపథ్యంలో జగన్‌ తన పర్యటన రద్దు చేసుకొన్నారు. తదుపరి మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. తాను తన తండ్రి వై యస్ కలసి 15 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకొనాన్నని , అలాగే బ్రహ్మోత్సవాలులో స్వయంగా శ్రీవారికి 5 ఏళ్ళు పట్టు వస్త్రాలు తన తలపై పెట్టుకొని భక్తి తో సమర్పించానని అయితే ఈసారి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శంచుకుందామంటే చంద్రబాబు సర్కార్ మతం పేరుతో అడ్డగిస్తున్నారని , వైసీపీ నేతలకు ఇప్పటికే తిరుమల నాతో పాటు వస్తే అరెస్ట్ చేస్తామని, నోటీసులు ఇచ్చారని ఆ నోటీసులు చూపించారు. తన పాద యాత్ర ఇక్కడి నుండే మొదలు పెట్టి పూర్తీ అయ్యాక శ్రీవారి అస్సిసులు తీసుకున్నాకే ఇంటికి వెళ్లానని గుర్తుచేశారు. స్వామి దర్శనానికి నాపై కొత్తగా డిక్లరేషన్ పేరుతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. . ‘నా మతం మానవత్వం. ఇదే విషయం డిక్లరేషన్‌లో రాసుకొండి. నేను ఇంట్లో బైబిల్ చదువుతా… బయటకు వెళితే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తా. ముస్లిం, సిక్కు, ఇతర మతాలను గౌరవిస్తా అని’ వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ మాజీ ముఖ్యమంత్రికే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ముఖ్యంగా దళితుల పరిస్థితి ఏంటీ? అని’ వైఎస్ జగన్ ప్రశ్నించారు. తిరుమల లడ్డు లో పశువుల కొవ్వులు కలిపారని, అవి భక్తులు తిన్నారని సీఎం హోదాలో ఉండి ఎప్పుడు చుసిన పచ్చి అబద్దాలు ఆడే ..చంద్రబాబు తన రాజకీయ స్వార్ధం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ను పణంగా పెట్టాడని, నిజానికి శ్రీవారి సన్నిధిలో టీడీపీ బోర్డు లో సేవకోసం వచ్చే ప్రముఖులు ఎవ్వరు ఆ తప్పు చెయ్యలేరని నేను బలంగా నమ్ముతున్నానని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *