సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తన భర్తను అక్రమంగా జైలు లో పెట్టారని ‘నిజం గెలవాలి’ అని యాత్ర ప్రారంభించిన నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడన్నారు. ఇక భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే .. చంద్రబాబు చేసిన అవినీతికి జీవితంలో బయటకు రాడన్నారు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని విమర్శించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు? భువనేశ్వరి ఏ స్థాయిలో ఉందని ప్రశ్నించారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నాక నేడు రూ. 2 లక్షల కోట్లు దాటిందని కొడాలి నాని అన్నారు.40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ. 35 కోట్ల ఫీజులు ఏ విధంగా కట్టారని కొడాలి నాని ప్రశ్నించారు. కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో ‘నిజం గెలవాలి’ అని యాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెరవనుక నుంచి టీడీపీకి మద్దతుగా ఉన్నాడని.. అయితే ఇప్పుడు ముసుగు తొలగింది అంతేనని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జనసున్నా పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వారసుడు లోకేష్ సమర్థుడు, ఢిల్లీ పారిపోయాడు కాబట్టే మగాడు లేక ఇంట్లో మహిళలు రోడ్లపైకి వస్తున్నారని కొడాలి నాని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *