సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా విడుదల అయిన నీట్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని వారికీ అభినందనలు తెలుపుతున్నానని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh) ప్రకటించారు. వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో టాప్-100లో ఏపీ రాష్ట్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. 19వ ర్యాంకు సాధించిన డి.కార్తీక్ రామ్ కిరీటి, 56వ ర్యాంకు సాధించిన కె.మోహిత శ్రీరామ్, 59వ ర్యాంకు సాధించిన డి.సూర్యచరణ్, 64వ ర్యాంకు సాధించిన పి.అవినాష్, 70వ ర్యాంకు సాధించిన వై.సమీర్ కుమార్, 92వ ర్యాంకు సాధించిన టి.శివమణిదీప్‌లకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.
