సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్ని నిత్యావసర వస్తువులు, కూరగాయలు వంట నూనెలుధరలు, పిల్లలకు విద్య సంస్థల పీజులు అన్ని పెరిగిపోవడమే కానీ తగ్గటం లేదు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేస్తున్నారో లేదో? తరువాత విషయం. ఉన్న చార్జీలు కూడా పెంచేస్తే ఎలా?తాజగా .. నేటి ఆదివారం డిసెంబర్ 1వ తేదీ నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఆద్వర్యంలోని చంద్రబాబు సర్కార్ ప్రజలు వినియోగ విద్యుత్తూ చార్జీలు పెంపుదల బాదుడు ప్రారంభించారు. ఈ నెల నుండి సర్దుబాటు చార్టీలు అంటూ 6,029 కోట్లు చార్జీలు పెంచారు. ఇదికాక 9,412 కోట్లు ట్రూ అఫ్ చార్జీలు అంటూ అదనపు విద్యుత్తూ చార్జీలు పెంచడంతో .. పేద, మధ్యతరగతి ప్రజలకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది.ఆదాయాలు పెరగటం లేదు.. ఖర్చులు పెరిపోతున్నాయి.. మరల ఇప్పుడు ‘అసలు కొసరు’ అంటూ విద్యుత్తూ చార్జీలు యూనిట్ కు ఎంత శాతం అదనంగా బాదేస్తారో ? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
