సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నటి త్రిష ను ఉద్దేశించి.. తెలుగువారికి కెప్టెన్ ప్రభాకర్ విలన్ గా గుర్తుండిపోయిన విలక్షణ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంపై తెలుగు హీరో, చిరంజీవి, కుష్భు లు, త్రిషకు మద్దతుగా స్వాందించడం జరిగింది. ,జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశం మేరకు మన్సూర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 41ఏ కింద నోటీసు ఇచ్చి 35 నిమిషాల పాటు విచారణ జరిపారు. తదుపరి , తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై మన్సూర్‌ అలీఖాన్‌.. నటి త్రిషకు సారీ చెప్పడం ఆమె క్షమించడంతో ఈ వ్యవహారం సద్దుమణిగిపోయిన విషయం తెల్సిందే. అయితే, తాజా ట్విస్ట్ ఏమిటంటే .. మన్సూర్‌ అలీఖాన్‌ తాను ఆ రోజు త్రిష గురించి అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదని మీడియాలో ఎడిటింగ్ చెయ్యడం వల్ల దాని అర్ధం మారిందని, మాటలు వక్రీకరించారని .. ఆ పూర్తీ వీడియో కోర్ట్ కు సమర్పిస్తున్నానని, ఆ విషయం అర్ధం చేసుకోకుండా నటి త్రిష, ఆమెకు మద్దతుగా చిరంజీవి, కుషుబు తనను తప్పు పడుతూ, తనకు పరువు నష్టం కలిగించారని, తనను చెయ్యని తప్పుకు వారు తీవ్ర మనోవేదనకు గురిచేసినందుకు వారి ముగ్గురు ఫై పరువు నష్టం, నష్టపరిహారం కోరుతూ, నాపై పలువురిని రెచ్చగొట్టేలా ప్రేరిపించినందుకు క్రిమినల్ తదితర కేసులు వేస్తున్నట్లు రేపు, సోమవారం వారికీ నోటీసులు ఇస్తున్నట్లు సంచలన ప్రకటన చేసారు…డామిట్ కధ అడ్డం తిరిగిందే ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *