సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వైఎస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులకు జగన్‌ పరామర్శించారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇటీవల ధ్వంసమైన అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్‌, కార్లు, ఇంటిని జగన్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. అంబటిపై బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలోస్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో కర్రలతో దాడి చేసారని, తదుపరి టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేశారని జగన్ ఆరోపించారు.. అంబటిని చంపడానికి దాడి చేసి చుట్టుముట్టిన సందర్భంలో ఆవేశంలో ఆయన నోరుజారారని జగన్ పేర్కొన్నారు. నోరు జారినందుకు చింతిస్తున్నా అని..అంబటి ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పారని జగన్ పేర్కొన్నారు. గతంలో నేను సీఎంగా ఉండగా చంద్రబాబు, పవన్, లోకేష్ నన్ను బూతులు తిట్టలేదా.. ? అప్పుడు వైసీపీ వాళ్ళు ఈ తరహా దాడులు చేసారా? అంటూ జగన్ ప్రశ్నించారు. అంబటిని హత్య చేయడానికే ఇంటి మీదకు వెళ్లారని ఆరోపించారు. దాడి చేసిన వారి మీద చిన్న కేసులు పెట్టి.. అంబటి రాంబాబును మాత్రం జైలుకు పంపించారని జగన్ విమర్శించారు. విడుదల రజినీ మీద కూడా దాడి చేసి.. తిరిగి ఆమె మీదనే కేసు పెట్టారని జగన్ పేర్కొన్నారు. జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేశారన్నారు. తగులబెట్టారని.. పోలీసులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ఎంత అరాచక పాలన చేస్తున్నారో అర్ధం అవుతుందా? ..తిరుమల లడ్డు ఫై జంతుకోవ్వులు కలిశాయని అపవాదులు వేసి దేవుడంటే భయం భక్తి లేకుండా.. రాజకీయాలకు వాడుకున్నారని, ఆఖరికి సిబిఐ సిట్ విచారణలో లడ్డులో జంతు కొవ్వులు కలపలేదని తేలిన, ఆ నెయ్యి ఒప్పందాలు వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగిందని తేలినప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డుపై రాజకీయాలు చేసి వైసీపీ ఇరికించాలని ప్రయత్నాలు ఆపడంలేదని, బరితెగించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *