సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండాకాలం ఎంత దారుణంగా ఉంది.. వర్షాకాలం ఎప్పుడు వస్తుంది? అని ఎదురుచూసేవారికి పనికొచ్చే సమాచారం.. వచ్చే జూన్ నెల 15వ తేదీకి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ అంచన వేసింది. ప్రతి ఏడాదీ మే 20 నాటికి అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్ 1 నాటికి కేరళను తాకుతాయి. అప్పట్నుంచే దేశం లో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలవుతుంది.అయితే ఈ ఏడాది ‘నైరుతి’ మూడు రోజులు ఆలస్యం గా జూన్ 4 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఇప్పటికే భారతవాతావరణ శాఖ ప్రకటించింది. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన పది రోజుల్లోగా రాయలసీమ మీదుగా ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. అనం తరం మరో వారం రోజుల్లోరాష్ట్రం లోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయి. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ 10కి బదులు 15వ తేదీకల్లా రుతుపవనాలు రాష్ట్రం లోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
