సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, పవిత్ర కార్తీకమాసం 23 వ రోజు సందర్భంగా గునుపూడి పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్థనస్వామి వారి ఆలయంలో టి.రవి బాబు శ్రీమతి శోభ గార్లు దంపతులుచే నేటి సాయంత్రం లక్ష పుష్పార్చన నిర్వహించారు. ( ఫై చిత్రం) నేటి ఉదయం మహన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం లక్ష పుష్పార్చన లక్ష కుంకుమార్చన చండీ హోమం, తదితర విశేష కార్యక్రమాలు దేవస్థాన అభిషేక పండిట్ కొత్తపల్లి శ్రీనివాసు అధ్వర్యములో జరిపించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఛైర్మన్ చింతలపాటి బంగార్రాజు, ఆలయ అర్చకులు చెరుకూరి రామకృష్ణ, కందుకూరి సోమేశ్వర రావు (సోంబాబు) పాల్గొన్నారు. నేడు సుమారుగా 4300 మంది భక్తులు విచ్చేయగా దర్శనముల టికెట్స్ ద్వారా రూ. 41848 /- రూపాయిలు లడ్డు ప్రసాదం విక్రయం వలన రూ.3135 /- రూపాయలువెరసి మొత్తం 44,983/- రూపాయలువచ్చి ఉన్నది మరియు శ్రీ స్వామివారి నిత్యాన్నదానం నందు కానుకల వలన రూ.59,362 /- రూపాయలు ఆదాయం లభించిందని కార్యనిర్వాహణాధికారి.డి రామకృష్ణంరాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *