సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పవిత్ర కార్తీకమాసం గునుపూడి పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్థనస్వామి వారి ఆలయంలో నేడు, శనివారం సోమరౌతు దుర్గా ప్రసాద్, సునీత దంపతులు ఉదయం మహన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం లక్ష రుద్రాక్ష పూజ లక్ష కుంకుమార్చన తదితర విశేష కార్యక్రమాలు చాలా వైభవంగా జరిగాయి ( ఫై చిత్రంలో లక్ష రుద్రక్షలతో స్వామి అలంకారం చూడవచ్చు..)దీనికి దేవస్ధానం ,ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ, కందుకూరి సోంబాబు తదితరులుసహకరించారు. నేటి ఉదయం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బి.కృష్ణమెాహన్ శ్రీ స్వామివారిని ఆలయ మర్యాదలతో దర్శించుకొన్నారు. నేటి కార్తీకమాసోత్సవములలో భాగంగా 12 రోజు అయిన ఈ రోజు భక్తులు టికెట్స్ దర్శనముల ద్వారా రూ.57,650/లు, పూజా రుసుముల ద్వారా రూ.24,866/లు, మొత్తం రూ.76,516/-లు ఆధాయం రాగా, 560లడ్డులు ప్రసాదం గా విక్రయించటమైనది అని కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
