సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలోని స్థానిక జిల్లా బీజేపీ కార్యాలయంలో నేడు, మంగళవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అడ్జక్షతన జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నేతల సమావేశంలో జరిగిన బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నేడు పశ్చిమగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా శ్రీమతి ఐనంపూడి శ్రీదేవి ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికే క్రింది స్థాయి నుండి బీజేపీ అభివృద్ధి కి ఏ పదవి ఇచ్చిన పని చేసానని, ఇప్పుడు జిల్లా అడ్జక్ష పదవి మరింత బాధ్యతగా అందరి క్యాడర్ సహకారంతో నిర్వహిస్తానని ప్రధాని మోడీ ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువ చేస్తానని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి ( ఏలూరు) రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ గారు, పశ్చిమగోదావరి జిల్లా భాజపా సంస్థాగత ఎన్నికల అధికారి మానేపల్లి అయ్యాజి వేమ గార్లతో కలిసి నియామక పత్రం అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
