సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సినీ పరిశ్రమలో 50 ఏళ్ళు పూర్తీ చేసుకొన్నా నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna) కు దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ భూషణ్’ (Padma Bhushan)కు నామినేట్ అయ్యారు. సినిమా పరిశ్రమకు అలాగే ఆయన చేస్తున్న రాజకీయ, సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని ఏపీ లోని ఎన్డీయే ప్రభుత్వం ఆయనని ‘పద్మ భూషణ్’ అవార్డుకు నామినేట్ చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ 2025 నామినేషన్స్ నిమిత్తం సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చిన నేపథ్యంలో దీనికి నామినేట్ అయిన వారి నుండి విజేతలను జనవరి 26 రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని ప్రకటించనున్నారు. లెజెండ్ నందమూరి తారక రామారావు నట వారసుడిగా బాలకృష్ణ.. జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ వంటి చిత్రాలలో అపూర్వమైన పాత్రలు ధరించారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకుని ప్రజలకు దగ్గరయ్యారు. మరోవైపు క్యాన్సర్ వ్యాధికి బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పటల్ చైర్మన్‌గా బాలయ్య సేవలు ప్రసంశనీయం.. ఇక అభిమానులకు జై బాలయ్య!
