సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో అత్యధిక ఓటింగ్ రావడంలో అభ్యర్థులు ఎవరి అంచనాలతో వారు మెజారిటీలు లెక్కపెట్టుకొంటున్న తరుణంలో మొన్న వారణాసి లో ప్రధాని మోడీ నామినేషన్ కు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక తమ పార్టీ విజయం కోసం దేవుడి ఫై భారం వేశారు. చంద్రబాబు దంపతులు వరుసగా పలు పుణ్య క్షేత్రాలు దర్శిస్తున్నారు. నేడు, గురువారం మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్రలో గల కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ వెళ్లారు. షిరిడీలో సాయిబాబా వారికీ ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు జ్ఞాపిక బహుకరించారు.
