సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ పొత్తులో భాగంగా జనసేన కు రాష్ట్రంలో ఇప్పటికే అనధికారికంగా 3 లోక్ సభ సీట్లు అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఖరారయ్యాయి అని భావిస్తున్నారు. దానికి తగట్టే జనసేన ఇప్పటికే ఆ 3 స్థానాలలో అభ్యర్థులను సిద్ధం చేసుకొంటుంది. ఈ నేపథ్యంలో పవన్ సోదరుడు నాగబాబు ను అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి నిలపడానికి రంగం సిద్ధం అయింది. ( గతంలో నాగబాబు నరసాపురం లోక్ సభ స్తానం నుండి పోటీచేసి ఓటమి పొందారు. )చాల రోజులుగా నాగబాబు అనకాపల్లి పరిధిలో జనసేన టీడీపీ నేతలను సమీకరిస్తున్నారు. అదే ప్రాంతంలో నివాసానికి ఇల్లు కట్టుకొంటానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన బరిలో దిగుతారని అందరు అనుకుంటుండగా పెద్ద ట్విస్ట్ జరిగింది. ఒకప్పుడు ఉత్తరాంద్ర రాజకీయాలలో కాంగ్రెసులోను, వైఎస్సా ర్ కాంగ్రెస్ లోను కీలక నేతగా రాణించిన బిసి నేత కొణతాల రామకృష్ణ ఇటీవల జనసేనలో చేరారు. తాను అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్థిని అని ప్రకటించుకోవడంతో అందరు అవాక్కయ్యారు. దీంతో నాగబాబు ఆయనను సమన్వయ పరచాలని చుసిన ససేమిరా అంటూ జనసేన లో నాగబాబు నేతృత్వంలో అనకాపల్లిలో జరిగిన పార్టీ సభలు, ప్రచార కార్య క్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ‘దీనితో పవన్ కళ్యాణ్ స్వయంగా నిన్న కొణతాల రామకృష్ణ గృహానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసిన అయన సీటు విషయంలో పట్టు వదలలేదని సమాచారం. సందడిలో సడేమియా అంటూ టీడీపీ నుండి వైవీ చక్రవర్తి మరియు సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ మరియు మరో సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు కొడుకు రత్నాకర్ సైతం పోటీగా బరిలో దిగేందుకు సిద్ధం అవుతుండటం తో నాగబాబు కు అనకాపల్లి సీటూ ఫై సస్పెన్సు ఇప్పటిలో వీడేటట్లు కనపడటంలేదు..
