సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఛార్జి తీసుకొన్న తరువాత తీసుకొన్న మొదటి విన్నతి అందరికి తెలిసిందే.. .. తమ కుమార్తె 9నెలలు గా కనిపించడం లేదంటూ , ఎవరో ట్రాప్ చేసి ఎక్కడికో తీసుకొనివెళ్ళారని మిస్సింగ్ కేసుగా భీమవరంకు చెందిన శివ కుమారి అనే మహిళ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చెయ్యడం.. శివకుమారి వద్ద ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఫోన్ చేసి మిస్సింగ్ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసును సత్వరం ఛేదించాలని ఆదేశించారు. పవన్ కల్యాణ్ స్వయంగా ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసులో కీలక పురోగతి లభించించింది. రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు కేసును ఛేదించారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో సదరు యువతి జమ్మూలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలో భీమవరం నుండి చదువుకోవడానికి వచ్చిన ఆ యువతి ఓక యువకుడి ప్రేమలో పడింది? 9 నెలలు క్రితం వెళ్లిపోయిన వారు ఇద్దరు జమ్మూలో ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి ఇద్దరినీ విజయవాడ తీసుకొస్తున్నారని, స్పెషల్ టీమ్ వారిని వెంటబెట్టుకొని వస్తోంది. దీనితో యువతి కుటుంబ సభ్యులు విజయవాడ చేరుకొన్నారు.
