సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రొయ్య రేటు మరింత పడిపోవడంతో ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కొత్త ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేం దుకు ఆక్వా రైతులు సన్నద్ధమౌతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆక్వా పంటలు నిలుపుదల చేస్తామని క్రాప్ హాలిడే ప్రకటించేందుకూ సిద్ధం అంటున్నారు. రేపు బుధవారం ఈ నెల 3న తలపెట్టినట్టి ‘ఛలో పాలకొల్లు’ ద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. అకాడెమీ అఫ్ ఇంటిగ్రేటెడ్ లివింగ్, జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం ల ఆధ్వర్యం లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కోస్టల్ ఆంధ్రా .. సముద్ర తీర ప్రాంత జిల్లాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు, ఆక్వా రైతు సంఘం ప్రసిడెంట్, సేకరెట్రీ లు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, బోనం చినబాబు మీడియా కు ప్రకటన విడుదల చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *