సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లి గూడెం సభలో చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ ఉద్దండుడు, మేధావి అని అటువంటి వ్యక్తిని జైలు లో పెడితే భరించలేక అక్కడే టీడీపీ కి మద్దతుగా పొత్తు ప్రకటించానని, అయినా జనసేనకు 10 ఏళ్లుగా క్షేత్ర స్థాయిలో ఇప్పటికి ప్రజల ఓట్లు వేయించుకొనే నెట్ వర్క్ లేదని, తాను 2 చోట్ల ఓడిపోయానని అటువంటి అప్పుడు 24 సీట్లు టీడీపీ ఇవ్వడం ఎక్కువే అన్నతీరులో సాక్షాత్తు జనసేనాని పవన్ బిగ్గరగా బల్లగుద్ది చెప్పడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు హతాశయములయ్యారు. జనసేన మద్దతుదారులు తన కూడా నడవలె కానీ తనకు ఎవరు సలహాలు ఇవ్వవద్దని సీనియర్ కాపునేతలు జోగయ్య కు ముద్రగడ లపై పరోక్షంగా వేదికపై నుండి మండి పడటంతో .. హరిరామ జోగయ్య తాజగా విడుదల చేసిన లేఖలో .. ఇక పవన్ కు చంద్రబాబు మంచి చెపితే అర్ధం కావడం లేదు.. ఇక వారి కర్మ.. అంటూ తేల్చేసారు. ఇక కాపు ఉద్య మ నేత ముద్రగడ పద్మ నాభం మరో ఘాటు లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ తనను నమ్మించి వదిలేశారని ఆరోపించారు. . మీ నిర్ణయాలు చంద్రబాబు చేతుల్లో ఉంటాయి తప్ప మీ చేతుల్లోలేవు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉన్నపుడు ఆయన టీడీపీ క్యాడర్ భయపడి ఎవరు బయటకు రాలేదు. అప్పుడు మీరే వచ్చి ఆయన ఇమేజ్ పెంచారు. ఇది యదార్ధం.. అటువంటిది జనసేనకు 80 సీట్లు 2 ఏళ్ళు సీఎం పదవి మీరు అడగలేకపోయారు. మీరు నన్ను కలవడానికి రెండు పర్యాయాలు కిర్లం పూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు. రాలేదు. యావత్తు జాతి కోసం నాకు జరిగిన అవమానాలు మరచిపోయి.. ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని నేను చెప్పడం జరిగింది. కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరం. మీ నిర్ణయాలు మీ చేతుల్లోలేవు. పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైంది.నేనా మీ అంత గ్లామర్ ఉన్న వ్యక్తిని కాదు అంటూ అని నిట్టుర్చారు ముద్రగడ.. .
