సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర 2వ విడుత రేపటి ఆదివారం ఏలూరులో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏలూరు ప్రజా సమస్యలపై ఎల్లుండి 10వ తేదీ సోమవారం ఉదయం జనవాణి నిర్వహించి సాయంత్రం 6గంటల నుండి క్యాడర్ తో సమావేశం అవుతారు. 11వ తేదీ దెందులూరులో ఉదయం స్థానిక క్యాడర్ తో సమావేశం అయ్యి సాయంత్రం తాడేపల్లిగుడెం చేరుకొంటారు. తదుపరి 12వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉదయం క్యాడర్ తో సమీక్షలు జరిపి తదుపరి సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో పాల్గొనేలా షెడ్యూలు ఖరారు అయ్యింది.
