సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యా ప్తంగా సార్వా ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో ప్రభుత్వ మే ధాన్యం కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సాంకేతిక సిబ్బంది, సహాయకులు నియామకాల తో సహా అధికారులు పూర్తీ చేస్తున్నారు. పశ్చి మగోదావరి జిల్లాలో 314, ఏలూరు జిల్లాలో 394, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసారు. పశ్చి మగోదావరి జిల్లాలో 4.65 లక్షల టన్నుల ధాన్యం , ఏలూరు జిల్లాలో 5.30 లక్షల టన్నులు, పంట ఉత్పత్తి అంచనా వేసి ఆ మేరకు సేకరణ లక్ష్యంగా ప్రారంభించారు. రెండు జిల్లాల్లోధాన్యం సేకరణకు సుమారు 3 కోట్ల గోనె సంచులు ను రైతులకోసం ఏర్పాటు చేస్తున్నారు, గతంలో గోనెసంచుల లేక పెద్ద సమస్య ఉత్పన్నం అయ్యింది. అందుకే ఈసారి ఇబ్బందులు తలెత్తకుండా..అవకాశం మేర కళ్లాల్లోనే ధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధరలు (క్వింటాల్కు..) ఏ–గ్రేడ్ గతంలో 2,060 కాగా ప్రస్తుత ధర 2,203 నిర్ణయించింది. ఇక సాధారణ రకం గతంలో 2,040 కాగా ప్రస్తుతం 2,183 రూపాయలకు కొనుగోలు ధర పెంచింది.
