సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు జిల్లాలో( తణుకు, తాడేపల్లి గూడెంలలో) ప్రజల నుండి భారీ స్వాందన వచ్చిందని, ఎక్కడ చుసిన ప్రజానీకం చంద్రబాబు కు మద్దతు ప్రకటిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇదే స్ఫూర్తి తో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 45 రోజుల పాటు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ కార్యక్రమాలు నిర్వహిస్తామని, జగన్ అసమర్ధ పాలన ప్రజల ముందు ఎండగడతామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి భీమవరం లో అన్నారు. భీమవరంలోని టీడీపీ నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకొంటారన్నారు. జగన్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోతున్నారని తమ దృష్టికి వచ్చిందని, వారు చంద్రబాబు పాలన కోరుకొంటున్నారని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డులలో జరుగుతున్నా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ కార్యక్రమాలలో స్థానిక టీడీపీ నేతలతో పాటు జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరావు తదితరులు పాల్గొంటున్నారు.
