సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో నేడు, గురువారం స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా.. అత్తిలిలో ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కూటమి, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వైసీపీకి చెందిన కారుమూరి నాగేశ్వర రావు నివాసం నుండి ysrcp ఎంపీటీసీలతో వెళుతుండగా అక్కడ వారిని టీడీపీ కూటమి నేతలు అడ్డుకున్నారు. ఓట్లు వెయ్యకుండా తమ సభ్యులను ను అడ్డుకోవడం ఏమిటని కారుమూరి ప్రశ్నించారు.ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. అలానే యలమంచిలి లో ఎంపీపీ ఎన్నికలలో తీవ్ర ఉద్రికత్త నెలకొన్న దృష్ట్యా, తగినంత కోరం లేక, ఎన్నిక వాయిదా పడింది. ఏలూరు జిల్లా: కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నిక జరుగుతోంది. ప్రధానంగా టీడీపీ కూటమి, వైసిపి మధ్య పోటీ నెలకొంది. మొత్తం 22 మంది ఎంపీటీసీలకు ఒకరు మరణించగా, మరొకరు రాజీనామా చేయగా 20 మంది మధ్య పోటా పోటీ నెలకొంది. కూటమికి పది వైసీపీకి పది మంది ఉండటంతో పోటీ ఉత్కంఠతగా మారింది.
