సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హడావిడిగా సంక్షేమ పధకాలు పెట్టి లబ్దిదారులను పెంచుకొంటూ పోతుంది. అయితే రాష్ట్రంలో జగన్ సర్కార్ మాత్రం జెట్ స్పీడ్ తో అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ ఆఖరికి నిధులు కొరత తో తీరా..ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ సంక్షేమ పథకాలలో ఉన్న లబ్దిదారులను తగ్గించుకొంటూ వస్తుంది. గత 2 ఏళ్లుగా అమ్మవడి, ‘విద్య దీవెన’ పీజు రియార్స్మెంట్ ,వసతి దీవెనలతో గతంలో ఉన్న లబ్దిదారులను విడతల వారీగా తగ్గించు కొంటూ వస్తుంది. ( కొత్త లబ్దిదారులకు చేరినప్పటికీ..) దీనితో పేద, మధ్యతరగతి కుటుంబాలలోని విద్యార్థులకు నిజంగా విద్యార్థులకు అర్హత ఉన్నపటికీ, మంచి ఫలితాలు సాదిస్తునప్పటికీ పట్టణాల్లో కాస్త ఇంటి స్థలం అధికంగా ఉందనో, విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయనో చిన్న చిన్న కారణాలతో వారికీ లబ్ది నిలిపివేస్తూ ఆ కుటుంబాలకు ఆకస్మికంగా ఇబ్బంది పాలు చేస్తున్నారు. కొందరు కాలేజీ విద్యార్థులు మధ్యలో చదువు ఆపేస్తున్న పరిస్థితి ఉంది. తాజగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 1,43,534 మంది తల్లుల ఖాతాలో 13వేలు చప్పున రూ.215.30 కోట్ల ను జమ చేశారు. అయితే ఈ ఏడాది జిల్లాలో సుమారు 8 వేల మంది తల్లులకు పైగా అమ్మ ఒడి ని వివిధ కారణాలు చూపి నిలిపివేశారని వార్త సమాచారం..నిజానికి వైసిపి మద్దతు దారులు కూడా భారీగా లబ్ది కోల్పోయినట్లు సమాచారం. ఇప్పుడు ‘జగనన్న సురక్ష ‘ పధకం ఇటువంటి వారిని ఏ మేర ఆదుకొంటుందో కానీ..దేశంలోనే ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ శక్తుల విద్య వ్యాపారాన్ని అడ్డుకొంటు..అందరికి ఉన్నత విద్య కు ప్రాధాన్యం ఇస్తున్న జగన్ సర్కార్ కొన్ని నిబంధనలు సడలించవల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *