సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కమిటీ సభ్యులు, విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, వైద్యఆరోగ్యశాఖ, మున్సిపల్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని జిల్లాలో భీమవరం, ఆకవీడు, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, పాలకొల్లు, నర్సాపురం, అత్తిలిలలో మొత్తం 41 పరీక్షా కేంద్రాలలో 8,953 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పదో తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 1,590 మందికి భీమవరం, నరసాపురంలలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.ఇంటర్ మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు., మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన మొత్తం 10,946 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా భీమవరం కేజీఆర్‌ఎల్ కాలేజీలో కమాండ్ కంట్రోల్ రూమ్ నంబరు: 90595 83683 ఏర్పాటు చేశామన్నారు.
