సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మానవ సంబంధాలు , స్వంత మమకారాలు ఎంత బలహీనమౌతున్నాయో? ఈ విషాద ఘటన నిరూపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడే పల్లి గూడెం సమీపంలోని పెంటపాడు మండలం మీనవల్లూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మూడు రోజుల క్రితం మీనవల్లూరుకి చెందిన పోకల వెంకట కళ్యాణ్ (6) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం నుంచి కనిపించడం పోవడంతో బాలుడి తల్లి శిరీష పోలీసులకుఫిర్యాదు చేసింది. గత శుక్రవారం సాయంత్రం యనమదర్రు కాలవలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు మృతదేహం దొరికింది. తాతనే బాలుడి పీక నొక్కి చంపేసి కాలవలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు,ఆస్థి తగాదాలు మధ్య తాతయ్య యే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమిక ఆధారాలతో నిర్ధారించారు. బాలుడు తండ్రి, తాత, నానమ్మ కూడా ఈ హత్య లో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాతయ్య పరారీ లో ఉండగా, బాలుడి తండ్రి నానమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృ తిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *