సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హడావిడిలో ప్రభుత్వ ఉద్యొగులు సచివాలయ ఉద్యోగులు దాదాపు పూర్తిగా ఎన్నికల విదులకే అంకితమైన తీవ్ర ఒత్తిడిలో పని చేసిన నేపథ్యంలో .. (కొందరు సెలవులలో ఉన్న కారణంగా) ఈ ఒత్తిడితో ఈ నెల 4 వ తేదీ ఓట్ల కౌంటింగ్ వరకు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఉన్నత విద్యకు దరఖాస్తులు చేసుకొనే విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడింది.గతంలో సచివాలయాలు లో చాల సులువుగా 3 లేదా 4 రోజులలలో విద్యార్థులు కావలసిన సర్టిఫికెట్లు పొందేవారు.6 నెలలు గడువు దాటినవి రెన్యూవల్ చేయించుకునేవారు ఎన్నికల కోడ్ సమయంలో ఈ సేవ కేంద్రాల సహకారం కూడా పొందవలసి వచ్చింది. జిల్లాలో 403 సచివాలయాలు గ్రామాల్లో వున్నా,ఈ సేవ కేంద్రాల సహకారం కూడా పొందవలసి వచ్చింది. jeeమైన్స్ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులకు మరో వారం రోజులలో లోపే కౌన్సెలింగ్‌లు మొదలు కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు అవసర మైన కుల, ఆదాయ,ఓబిసి, ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్స్‌లు తీసుకునేందుకు వారు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కొందరు సెలవుల్లో ఉన్న కారణంగా . విద్యార్థులకు సర్టిఫికెట్స్ కోసం కొన్ని రోజులుగా ఎదురుచూపులుగా మారింది. జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో కొన్ని రోజులుగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం చేసుకున్న దరఖాస్తులు సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే తహశీల్దార్ లు వీటిపై ద్రుష్టి పెట్టడంతో సర్టిఫికెట్స్ కదులుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 10,510 మంది ఇంటర్ పూర్తి చేసి తదుపరి కోర్సుల్లో చేరడానికి పదో తరగతి పూర్తి చేసుకున్న 17,007 విద్యార్థులు ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులలో, ఇతర కోర్స్ లలో చేరడానికి సర్టిఫికెట్లు అవసరం. వారి ఇబ్బందులు అధికారులు త్వరితగతిన తొలగిస్తారని కోరుకొందాం..
