సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 13,854 మంది తపాలా బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోగా గత బుధవారం వరకు 13,177 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సౌలభ్య కేంద్రాల్లో సోమ, మంగళవారాల్లో 12,773 మంది, గత బుధవారం మరో 404 మంది ఆర్వో కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ప్రకటించారు. మిగిలిన పోస్టల్ బ్యాలెట్ వినియోగించవలసినవారు ఈ నెల 11వ తేదీ వరకు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి వద్ద ఓటు హక్కు వినియోగించుకోచ్చని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ను దాదాపుగా విజయ వంతంగా పూర్తి చేసినందుకు కలెక్టర్‌ ఆర్వోలను అభినందించారు. భీమవరం, ఆచంట లోని పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ తీరును కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *