సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చి మగోదావరి జిల్లాలో లక్ష ఎకరాల లో చేపల సాగు జరుగుతుండగా.. ఇటీవల అనూహ్యంగా వాతావరణ మార్పులకు తోడు పెరిగిన మెతల ధరల తో పాటు చేపల ధర తగ్గిపోవడంతో స్వంత ట్యాంక్ లు ఉన్నవారు పర్వాలేదు కానీ.. జిల్లాలో చెరువు భూములను లీజుకు తీసుకుని చేపల సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా జోన్ భీమవరం ప్రాంతం నుండి లారీలలో ఇక్కడి చేపలను అస్సాం , కలకత్తా , బీహార్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ ఎగుమతి చేస్తుంటారు. అయితే ఇటీవల జిల్లాలో రైతులు ఎక్కువగా శీలావతి, కట్ల, ఫంగస్ రకం చేపలు పండిస్తుంటారు. గతంలో ఫంగస్ చేప కిలో రూ.80 వరకు విక్రయాలు చేయగా, ప్రస్తుతం రూ.74,శీలావతి, కట్ల రకం చేపలు గతంలో 115- 120 రూపాయలు వరకు ధర ఉండగా ఇప్పుడు కిలో రూ.100 మాత్రమే ధర పలుకుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రేపు, ఆదివారం రిటైల్ మార్కెట్ లోను చేప ధర గతంతో పోలిస్తే తక్కువ ధరకే లభ్యం అయ్యే అవకాశం ఉంది.
