సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా ఐదేళ్ల లోపు పిల్లలకు, ఇంతవరకు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని ఐదేళ్ల లోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీ లకు వ్యాక్సినేషన్‌ను చేపడుతున్నట్టు జిల్లా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈనెల 7నుంచి 12 వరకు, సెప్టెంబరులో రెండోవిడతగా 11నుంచి 16 వరకు, మూడో విడతగా అక్టోబరు 9నుంచి 14 వరకు టీకాలు వేస్తామన్నారు. మాత శిశు సంరక్షణశాలలో కూడా ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి.
