సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లాకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉరుములు, పిడుగులుతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే నేడు, మంగళవారం వర్షాలకు కొంత విరామం వచ్చింది. అయితే . అల్పపీడనం రేపు బుధవారం ( ఈనెల 23 వ తేదీ) నాటికి వాయుగుండంగా బలపడే అవకాశాలు న్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ కారణంగా ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురుస్తా యని ఈనెల 24 నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని చెబుతోంది. జిల్లాలో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. ఇప్పటికే జిల్లాలో వరి మాసూళ్లు ప్రారంభమయ్యాయి. వరికోతలు కూడా మొదలు కావటంతో రేపటి నుండి వర్షాలు భారీగా కురిస్తే మాత్రం పంట నష్టం ఎక్కువ ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏలూరు జిల్లాలో ఇప్పుడు కొన్ని మండల్లాలోనే వరి కోతలు ప్రారంభం అయ్యాయి.నేటి మంగళవారం నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు తెరిచారు.అయితే భారీ వర్షాల భయంతో కొందరు రైతులు పంట కొయ్యడనికి వెనకడుగు వేస్తున్నారు. ఎక్కువ రోజులు వర్షాలు పడితే పంట చేలలోనే కుళ్లిపోయే ప్రమాదం కూడా పొంచివుంది మరి..
