సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల పలుప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్ప డుతున్న దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ ప్రకటించారు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. తమకు దొరికిన నిందితులలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి గ్రామానికి చెందిన కందికొండ కృష్ణ, తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బంటుమిల్లి సాయిబాబు, చల్లా అప్పలస్వామి ఒక దొంగల ముఠాగా ఏర్పడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. గత నెల 21న స్థానిక ఏలూరు రోడ్డులోని ఓ ఇంట్లోకి చొరబడి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలు ద్వారా దర్యా ప్తు చేపట్టారు. కీలక సమాచారం మేరకు వీరిని తాడేపల్లి గూడెం పట్టణంలో అరెస్టు చేసినట్లు, ప్రకటించి స్థానిక పట్టణ పోలీస్ అధికారులను అభినందించారు. వారి నుంచి 234 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీ వెండి వస్తువులను స్వాధీనం చేసుకొన్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగరాజు, ఎస్సై లు జీజే ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నా రు.
