సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక ఎన్నికలకోడ్ అమలులోకి వచ్చింది. జిల్లాలో నరసాపురం లోక్ సభ స్తానం, అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలలో ఓటర్లు వివరాలు చుస్తే.. భీమవరంలో అత్యధికంగా మొత్తం ఓటర్లు 2,51,301 మంది ఉండగా వారిలో పురుషులు 1,22,228 మంది మహిళలు 1,29,02,350 మంది ఉన్నారు. ఇక ఆచంట నియోజకవర్గంలో 1,78,668మంది ఓటర్లు, పాలకొల్లు లో 1,93,379 మంది ఓటర్లు, నరసాపురంలో జిల్లాలో అతి తక్కువగా 1,68,187 ఓటర్లు, ఉండిలో 2,22,999 మంది ఓటర్లు, తణుకు లో 2,33,082 మంది ఓటర్లు, తాడేపల్లిగూడెం లో 2,13,722 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా మొత్తం నరసాపురం లోక్ సభ సీటుకు 14 లక్షల,61వేల 338 ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 7,16,956 మంది మహిళలు 7,44,30,874 మంది ఉన్నారు.
