సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ గత సోమవారం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల విధులు నిర్వహించే 13,854 మంది ఉద్యోగులు ముందుగానే తమకు నచ్చిన అభ్యర్థులకు ఓట్లు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతి పొందారు. తొలిరోజు గత సోమవారం 7,540 మంది ఓటు హక్కు ను వినియోగించుకొన్నారు. భీమవరం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ కేంద్రాలను ఒకేచోట భీమవరం పట్టణంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. భీమవరం నియోజకవర్గానికి 2 వేల 781 మంది దరఖాస్తు చేసుకోగా 1,295 మంది ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఉండిలో 1,625 మందికి గాను 1,034 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షించారు. తొలిరోజు ఓటు వేయని వారు కూడా నేడు, మంగళవారం సెంటర్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఈ రెండు రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు సంబంధిత నియోజకవర్గ ఆర్వో కార్యాలయాల వద్ద ఓటు హక్కు వేయాలన్నారు. నూటికి నూరు శాతం ఓటు ను వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు, కోస మెరుపు ఏమిటంటే.. పోస్టల్ బ్యాలెట్ లు వినియోగించిన వారికీ భీమవరంలో ఓటుకు 3వేలు వరకు మభ్య పెట్టాయని టాక్..
