సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకప్పుడు దక్షిణాదిన ఎక్కువ సినిమా థియేటర్స్ తెలుగు రాష్ట్రాలలో ఉండేవి. 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళితే 3వేలు సినిమా థియేటర్స్ ఉండేవి. ఎప్పుడయితే ప్రముఖ హీరోలు వారి సినిమాలు 2 ఏళ్ళకు 4 ఏళ్లకు ఒక సినిమా చప్పున చేస్తున్నారో, తెలుగు సినిమా హాళ్లకు గ్రహణం పట్టింది.పెద్ద హీరోల రెమ్యూనేషన్ స్వార్ధం, పాన్ ఇండియా సినిమా రేంజ్.. థియేటర్స్ ఉసురు తీసింది. అయితే పెద్ద సినిమా.. లేకపోతె బడ్జెట్ సినిమా.. అదికాస్తా ఎలానూ 2వారాలకే ఓటిటి లో వచ్చేస్తుంది. పెద్ద సినిమా 4 లేదా 5 వారాలకు ఓటిటి లో వచ్చేయడం కారణం తో సినిమా థియేటర్స్ కు వెళ్లి కుటుంబానికి 1000 రూపాయలు పైన ఖర్చుపెట్టి సినిమా చూసే ఆనందం ఆవిరైంది. దానికన్నా మల్టి ఫ్లెక్స్ థియేటర్స్ కైతే యూత్ మహారాజ పోషకులుగా ఇంకా ఉన్నారు. ఇన్ని దెబ్బలకు తోడు 4 ఏళ్ళ క్రితం కరోనా మహమ్మారి దెబ్బకు వందలాది థియేటర్స్ ముసినవి మరల తెరుసుకోలేదు. ప్రస్తుతం ఏపీలో 1500 పైగా థియేటర్స్ తెలంగాణ లో 500 పైగా థియేటర్స్ మాత్రమే రన్నింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో తాత్కాలికంగా సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్స్ మూసివేయడం మరింత ఆందోళన కరం. మరో 3నెలలలో ఏపీలో కూడా పెద్ద ఎత్తున సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతబడనున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కేంద్రాలయిన ఏలూరులో ఇటీవల మరో 2 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడ్డాయి, ప్రస్తుతం భీమవరంలో మల్టి ఫ్లెక్స్ లో 4 స్క్రీన్ కలపి పట్టణంలో 11 స్క్రీన్ మాత్రమే రన్నింగ్ లో ఉన్నాయి. గతంలో మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో.., 1′ నేనొక్కడినే 14 స్క్రీన్స్ ఫై వేశారు. అది పరిస్థితి. వన్ టౌన్ లో మిగిలిన ఏకైక థియేటర్ అన్నపూర్ణ కూడా కరోనా సమయంలో మూసేసారు. ఒక్కపుడు విస్సాకోడేరు గోపి కృష్ణ తో కలపి వన్ టౌన్ లో 7 థియేటర్స్ ఉండేవి. ఇప్పుడు ఒక్కటి మిగలలేదు. భీమవరం పట్టణంలో మరో 3 నెలలు లో మరో కీలకమైన సింగిల్ స్క్రీన్ థియేటర్, మరో 2 స్క్రీన్స్ థియేటర్స్ మూసివేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ అయ్యాక జరిగే అవకాశం ఉంది. ప్రదర్శనకు కొత్త సినిమాలు లేవు కనీసం ఐదుశాతం ఆక్సుపెన్సీ కూడా లేకుండానే షోలను ప్రదర్శించాల్సిన దుస్థితిలో యాజమాన్యాలు ఉన్నాయి. ఈ థియేటర్స్ లో పని చెయ్యడానికి స్టాఫ్ కూడా దొరకని పరిస్థితి. గత 5 నెలలు లో గుంటూరు కారం, టి.జె టిల్లు స్క్వేర్, హనుమాన్, మాత్రేమే బాక్సాఫీస్‌ల వద్ద కనక వర్షం కురిపించాయి. ఏది ఏమైనా వేలాది మంది కి వినోదం పంచిన థియేటర్స్ మూసివేస్తుంటే సినిమా ప్రియులకు చెప్పలేని బాధ.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్
