సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు టీడీపీ నుండి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని భావించినప్పటికీ ఉత్తరాంద్ర టీడీపీ నేతలు సుముఖంగా లేని కారణముగా ఆ ప్రతిపాదన విరమించుకోనట్లు తెలుస్తుంది. 2019లో జగన్ మద్దతుతో గెలవడం వైసీపీ ఎంపీగానే అయిన.. గత 4 ఏళ్లు పైగా చంద్రబాబు పక్షాన మాట్లాడుతూ ఒకరకంగా టీడీపీ అనధికార ఎంపీగా కొనసాగిన రఘురామా కృష్ణంరాజు ను ఈ పరిస్థితులలో వదిలేస్తే అది టీడీపీ క్యాడర్ లో కూడా తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందన్న భావనతో ఆయన గౌరవం కాపాడటానికి కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిస్తే.. కూటమి అధికారంలోకి రాగలిగితే.. మంత్రి పదవి ఆఫర్ తో ముందుకు సాగేలా ప్యూహం సిద్ధం అవుతుంది. ఇంకా ఎన్నికలకు నామినేషన్స్ నోటిఫికెషన్స్ రావడానికే 20 రోజులు పైగా సమయం ఉంది కాబ్బటి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కోటా క్రింద ఉన్న 4 నియోజకవర్గాలలో ఎదో ఒక నియోజక వర్గం నుండి ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులలో ఒకరిని ఒప్పించి లేదా జనసేన ను ఒప్పించి ఇదే జిల్లా నుండి రఘురామా ను పోటీలో దించాలని కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉండి నుండి ‘రఘురామా’ పోటీ చేస్తే ఉండి లో ఇప్పటికే తీవ్ర ప్రచార బరిలో ఉన్న టీడీపీ కి చెందిన ‘ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే’ ఇద్దరు రామరాజుల మధ్య వివాదం పరిష్కరించి వారి అంగీకారంతో మధ్యే మార్గంగా ఇద్దరికీ సన్నిహితుడైన రఘురామా కు స్థానం కల్పించవచ్చు.. అయితే కొందరు ప్రచారం చేస్తున్నట్లు కూటమి కోసం కృషి చేసిన రఘురామా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం లేదు.. అయితే ఊహించని రీతిలో జనసేన అభ్యర్థిగా పశ్చిమ లో ఎదో అభ్యర్థిని ఒప్పించి బరిలోకి దిగిన కూడా ..? ‘కూటమి’ రాజకీయాలలో సర్దుకుంటే ఏదయినా సాధ్యమే.. కానీ ఆయా పార్టీల కార్యకర్తల అభిప్రాయాలు ఎలా ఉంటాయన్నదే అసలు సమస్య.. చూద్దాం..
