సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – జలవనరుల శాఖ గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా కుందరాజు మురళీ కృష్ణంరాజు (అనాకోడేరు), వైస్ చైర్మన్ గా గుబ్బల మర్రాజు (నరసాపురం)లు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డికి చైర్మన్, వైస్ చైర్మన్ లు ఎన్నికల నియామక పత్రాన్ని అందించగా వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో నేడు, శనివారం భీమవరంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, ఎపిఐఐసి చైర్మన్, టీడీపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, టీడీపి పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఎన్నికైన సభ్యులను అభినందించి మాట్లాడారు. నీటి సంఘాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరుగుతున్నాయని, అన్ని చోట్ల ఏకగ్రీవంగా కూటమి సభ్యులను ఎన్నుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు
