సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ నుండి యుద్ధ భయంతో పాక్ ఆర్మీ రాజీనామాలతో పలాయనం బాటలో నడుస్తున్న వేళా.. ఉన్న మిగతా పాక్ ఆర్మీ తన బలగాలను ఎల్ఓసీ, భారత్ ఇతర సరిహద్దులకు తరలించిన నేపథ్యంలో.. పాకిస్తాన్ నుండి స్వతంత్ర దేశం కోసం శతాబ్దాలుగా పోరాడుతున్న బెలూచిస్తాన్ తిరుగుబాటు దారులకు ప్రస్తుతం కాలం బాగా కలసి వచ్చింది. పాకిస్తాన్ భారత్‌తో యుద్ధం మొదలు పెట్టక ముందే , పాకిస్తాన్ భూభాగంలో సగ భాగం బలూచిస్తాన్‌ని కోల్పోయేలా ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ వ్యా ప్తంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) భారీ దాడులు చేస్తుంది. పలు పట్టణాలను ఆధీనంలోకి తీసుకొంటుంది. కలాట్ జిల్లాలోని మం గోచార్ పట్టణాన్ని బీఎల్ఏ తన స్వాధీనం చేసుకుంది. అనేక ప్రభుత్వ భవనాలతో ఆధీనం లోకి తీసుకుంది. ఒక భవనానికి నిప్పు పెట్టింది. పాక్ ఆర్మీ ని వారి వాహనాలను టార్గెట్ చేస్తూ బీఎల్ఏ యోధులు విరుచుకుపడుతున్నరు. వారి దెబ్బ కు పాక్ సైనికులు పలాయనం చిత్తగిస్తున్నారు. ప్రావిన్స్ లోని తర్బాత్, డుక్కీ, తన్నుక్ ప్రాంతం లో బీఎల్ఏ జరిపిన దాడుల్లో 22 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. బీఎల్ఏ కూడా ముగ్గురు ఫైటర్లను కోల్పోయినట్లు చెప్పారు. బెలూచిస్తాన్ తిరుగుబాటు దారులకు భారత్ మరియు ఆఫ్గనిస్తాన్ ల లోపాయకారి మద్దతు ఉందని పాకిస్తాన్ చాల కాలంగా ఆరోపిస్తుంది.
