సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ లోని కీలక ఉగ్రవాద నేతలు వారి కుటుంబాలు చనిపోవడంతో వారి అంత్యక్రియాలలో పాక్ ఆర్మీ అధికారులు పాల్గొని కన్నీరు కార్చడం చూసి ప్రపంచం నివ్వెరపోయింది. మొన్నటి వరకు పాక్ లో ఉగ్రవాదులుకు శిక్షణ ఇవ్వడం ఏమిటి? అని బుకాయించిన పాక్ నిజస్వరూపం ఫై ప్రపంచ దేశాలకు అనుమానాలు పూర్తిగా నివృత్తి అయ్యాయి. అయితే తమకు కవల సోదరులు లాంటి ఉగ్రవాదుల మృతితో పాక్ ఆర్మీ మరింత రెచ్చిపోయింది.ఎలానూ ఎదురుదాడి చేసే దమ్ము లేదు. అందుకే LOC నిబంధనలు అతిక్రమించింది.భారత్ సరిహద్దులలో లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా అమాయక ప్రజల నివాసాలపై మినీ మిసైల్స్ , రాకెట్ లాంచర్లు , పిరంగుల్తో కాల్పులకు తెగబడుతూనే ఉంది. గత బుధవారం జమ్మూకాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, యూరీ, అఖ్‌నూర్ ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో మొత్తం 13 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు చిన్న పిల్లలు, ఒక సైనికుడు కూడా ఉన్నాడు. గత వారం రోజులుగా ఇప్పటి వరకు జరిగిన పాక్ ఆర్మీ కాల్పులలో 40 మంది భారతీయులు చనిపోయి ఉంటారని అంచనా..
