సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్-1 ‘ ట్రైలర్ నేడు, శుక్రవారం రాత్రి 7.19 గంటలకు విడుదలైంది , ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ఇండియా చిత్రం ‘ట్రైలర్ అభిమానులను సంతృప్తి ప‌రుస్తూ ఏకంగా 3 నిమిషాల 47 సెంకడ్ల నిడివితో అన్ని ప్రముఖ బాషలలో విడుదలయి . నిమిషాల వ్యవధిలో మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డులు తిరగరాస్తుంది. ట్రైల‌ర్‌లో ఒక్కో సీన్ గూస్‌బంప్స్ తెచ్చేలా ఉండ‌గా ర‌వి బ‌సూర్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంత‌కు మించి అనేలా ఉంది. వీట‌న్నింటిని మించి ఒక్కో పాత్ర…మలయాళ హీరో, పృథ్విరాజ్.. విలన్ జగపతిబాబు డైలాగ్స్ తో పాటు ప్రభాస్ యాక్ష‌న్ సీన్స్ అదుర్స్ అన్న‌ట్లుగా హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్ లోనే కథ చెప్పేసారు. ప్రభాష్ కు ఇచ్చిన ఎలివేసన్స్ అయితే సూపర్.. ఈ చిత్రం రెండు భాగాలుగా వ‌స్తున్న‌ది. ఈ క్ర‌మంలో మొదటి భాగం సలార్‌ సీజ్‌ఫైర్ పేరుతో కిస్మస్‌ పండుగ సందర్భంగా డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *