సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం యూరప్ వెళ్లారు. తాజా సమాచారం ప్రకారం ఆ సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన యూరప్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్టోబర్ లో తిరిగి ఇండియాకు రానున్నట్లు సమాచారం. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎప్పుడో బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో నెలల తరబడి తాళ్లు కట్టుకొని ప్రమాదకర యాక్షన్ సీన్స్ చేయడంతో ప్రభాస్ కి మోకాకి నొప్పి సమస్య వచ్చింది. ఆ మధ్య తాత్కాలిక చికిత్స తీసుకొని షూటింగ్లో పాల్గొన్నారు. ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ మోకాలినొప్పి తోనే పూర్తి చేశాడు. అయితే నొప్పి మరింత తీవ్రతరం కావడంతో తప్పనిసరి పరిస్థితులలో సర్జరీ చేయించుకొన్నారు
