సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరుకోవడంతో నేటి శనివారం ఉదయం ఉదయం ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరు మండలంలో గొల్లలకోడేరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి అపార్ట్మెంట్స్ వద్దకు వెళ్లి ఓటర్లు ను సైకిల్ గుర్తుపై వెయ్యాలని ఓట్లు అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. గత శుక్రవారం సాయంత్రం రఘురామా కృష్ణంరాజు కాళ్ళ మండలంలో బొండాడ పేట, బొండాడ, కోపల్లె, వేంపాడు గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. నేటి తో దాదాపు నియోజక వర్గం పర్యటన పూర్తీ చేస్తున్నారు.
