సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: AP రాష్ట్ర వ్యాప్తంగా వృధులకు వికలాంగులకు నిన్న పింఛను పంపిణీలో కొన్ని ప్రాంతాలలో అపశృతులు జరిగాయి. సచివాలయ ఉద్యొగులు 7 వేల రూపాయల పింఛన్ లలో 500 రూ నుండి 1000 రూ కమిషన్ లు కొట్టేసిన ఘటనలు ఫై అధికారులు వారిని సస్పెండ్ చెయ్యడం మరో చోట 4 లక్షల పైగా పింఛను లకు ఇవ్వవలసిన ప్రభుత్వ సొమ్ము డ్రా చేసుకొని సచివాలయ ఉద్యోగి తనకు కళ్ళు తిరిగి పడిపోతే ఎవరో కొట్టేశారని తప్పుడు పిర్యాదు చెయ్యడం వంటి పలు ఘటనలు జరిగాయి. అయితే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరులో పింఛన్ సొమ్ము రూ.2,50,500 డ్రా చేసిన పంచాయతీ సెకండ్ కార్యదర్శి రాము గత సోమవారం విధులకు గైర్హాజరయ్యాడు. దీంతో పింఛన్ పంపిణీ ఆగిపోయింది. ఈ మేరకు మరో పంచాయతీ కార్యదర్శి రాజేశ్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హరికృష్ణ తెలిపారు.
